Vakeel Saab Public Talk Digital LIVE || Pawan Kalyan || Anjali || Prakash Raj – TV9నటీనటులు: పవన్ కళ్యాణ్ , అంజలి, నివేద థామస్, అనన్య , శృతిహాసన్
సంగీతం: తమన్
నిర్మాతలు: దిల్ రాజు, బోణి కపూర్
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వేణు శ్రీరామ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ళ తర్వాత వెండితెర పై కనిపించరు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ గా సందడి చేశారు పవన్. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమా రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పవర్ స్టార్ లాయర్ గా కనిపించారు. నేడు (ఏప్రిల్ 9న) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అర్ధరాత్రి నుంచే థియేటర్స్ వద్ద అభిమానుల కోలాహలం మొదలైంది. ఇక ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం ..

కథ :

పల్లవి (నివేదా థామస్) జరీనా (అంజలి) అనన్య (అనన్య) ముగ్గురు సన్నిహితులు, హైదరాబాద్‌లో నివాసముండే ఈ ముగ్గురు యువతులు ఒక రోజు ఓ పార్టీకి హాజరవుతారు అక్కడ అనుకోకుండా ఇబ్బందుల్లో పడతారు. అనుకోని పరిస్థితుల్లో ఆ ముగ్గురిలో ఒకరు వంశీ (వంశీ కృష్ణ) ను గాయపరుస్తారు. ఇది పెద్ద గందరగోళాన్ని సృష్టిస్తుంది. దాంతో ఆ ముగ్గురు యువతులపై కేసు నమోదు అవుతుంది. ఆ ముగ్గురు తమకు న్యాయం చేయమని లాయర్ సత్యదేవ్ (పవన్ కళ్యాణ్ ) వద్దకు వెళ్తారు. మరో వైపు ఆ ముగ్గురిని కేసులో ఇరికించడానికి లాయర్ నందా(ప్రకాష్ రాజ్) వాదిస్తుంటాడు. ఈ సవాల్ ను సత్యదేవ్ ఎలా ఎదుర్కొన్నాడు..? ఆ యువతులకు సత్యదేవ్ ఎలా సాయం చేశారు..? ఈ కేసు నుంచి వారు బయటపడ్డారా..? లేదా..? అన్నది మిగిలిన కథ.

విశ్లేషణ :

పవన్ కళ్యాణ్ తన ట్రేడ్ మార్క్ మ్యానరిజం అలాగే బాడీ లాంగ్వేజ్ ఎప్పటిలానే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పవర్ ఫుల్ లాయర్ పాత్రలో అద్భుతంగా నటించారు పవన్. డైలాగ్ డెలివరీలో తనదైన స్టైల్ ను జోడించి ధియేటర్స్ దద్దరిల్లేలా చేసాడు పవన్. ముఖ్యంగా సెకండ్ ఆఫ్ లో వచ్చే కోర్టు సన్నివేశాల్లో పవన్ తన విశ్వరూపం చూపించాడని చెప్పాలి. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కు పర్ఫెక్ట్ కంబ్యాక్ మూవీ అని చెప్పవచ్చు. అలాగే నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్లా వారి వారి పాత్రల్లో చాలా బాగా నటించారు. ఇక ప్రకాష్ రాజ్ ఎప్పటిలాగేనే తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇతర నటులలో వంశీ కృష్ణ మరియు అమిత్ శర్మ కూడా వారి నటనతో మంచి ప్రభావాన్ని చూపించారు.

బాలీవుడ్ లో పింక్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అదే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఎక్కడ మెయిన్ పాయింట్ ను మిస్ అవ్వకుండా చాలా బాగా హ్యాండిల్ చేశారు దర్శకుడు వేణు శ్రీరామ్. అలాగే తమన్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసాడు. ముఖ్యంగా పవన్ ఎలివేషన్ సీన్స్ లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు తమన్. కెమెరా పనితనం వాస్తవికంగా కనిపిస్తుంది అది ఒక్కటి చాలు ఈ సినిమా నిర్మాణ విలువలు అగ్రస్థానంలో ఉన్నాయని చెప్పడానికి.

ప్లస్ పాయింట్స్ :

యాక్షన్ మరియు ఎమోషన్ సన్నివేషాలు
నటీ నటుల ఫర్ఫార్మెన్స్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
స్క్రీన్ ప్లే
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

బలహీనమైన ప్లాష్ బ్యాక్
చివరిగా…

పవన్ కోర్టులో వాదించాడు.. కోటు తీసి రికార్డులను వాయిస్తున్నాడు..

For more Subscribe TV9 Entertainment :

Watch LIVE:

► Subscribe:
►Subscribe to Tv9 Entertainment Live:
►Subscribe to Tv9 Telugu Live:
► Download Tv9 Android App:
► Download Tv9 IOS App:

#VakeelSaabPublicTalk #VakeelSaabReview #TV9Entertainment

#VakeelSaab #PawanKalyan #Anjali #PrakashRaj #VakeelSaabTalk

source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *